తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరం వేసవికి ముందే తాగునీటి తంటాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా భిక్కనూరులో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు.
ఇంటింటికి మంచి నీరందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ఇంకా కొన్ని గ్రామాల్లో అమలు కావడం లేదు. నీటి ఎద్దడున్న ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం అనెక ఇబ్బందులకు గురవుతున్నారు.
భిక్కనూరు మండల కేంద్రంలో వేసవి రాకముందే తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. మంచి నీరు కావాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి తీసుకురావాల్సిన దుస్థితి ఎదురైంది.
తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు అనేకసార్లు మొర పెట్టుకున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారని అక్కడి ప్రజలు వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు సంబదిత అధికారులు స్పందించి తాగు నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.