ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

187
Destruction idols in the temple

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.

ఈ ఘటన యూపీలోని సహరన్‌పూర్‌ జిల్లా హౌజ్‌ఖేరి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడిని 32 ఏండ్ల రిషిపాల్‌గా పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే మృతుడు రిషిపాల్‌కు పదేండ్ల కిందట పూనమ్‌తో వివాహమైంది.

ఆ తర్వాత పూనమ్‌కు పొరుగున ఉండే అంకుర్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది.

ఈ విష‌యం రిషిపాల్ కు తెలియ‌డంతో భార్య‌ను పలుమార్లు హెచ్చ‌రించాడు. దీంతో కోపం పెంచుకున్న పూన‌మ్..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను ఎలాగైనా అడ్డుతొల‌గించుకోవాల‌ని పథకం పన్నింది.

రాత్రి వేళ భర్త నిద్ర‌పోతున్న స‌మ‌యంలో ప్రియుడు అంకుర్‌ని పిలిచి ఇద్దరూ క‌లిసి అత‌ని గొంతు కోసి హతమార్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ధార్యాప్తు చేస్తున్నారు.