మోదీతో కేసీఆర్ దోస్తీ ఎందుకు?: రేవంత్ రెడ్డి

261
Why KCR friendly with Modi ?: Rewanth Reddy

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది.

ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

కూకట్ పల్లిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీతో కేసీఆర్ ఎందుకు దోస్తీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు చలిజ్వరమని రేవంత్ వ్యాఖ్యానించారు.

మోదీ, కేసీఆర్ ఇద్దరూ నాణేనికి బొమ్మాబొరుసు వంటివారని విమర్శించారు.

తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్టు రాలేదని మంత్రి కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

లక్షా 91 వేల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.