అదుపు తప్పి ట్రక్కు బోల్తా..16 మంది దుర్మరణం

167
Two killed in Bolero vehicle collision

మహారాష్ట్రలో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జలగావ్ జిల్లాలోని కింగ్వాన్ సమీపంలో అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందగా మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ కూలీ పనులు చేసేవారిగా గుర్తించారు.

మృతుల్లో ఎనిమిది మంది పురుషులతో పాటు ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది.

క్షతగాత్రులను జలగావ్ జిల్లాలోని అభోడా, కేర్హళ, రావెర్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.