హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సినీనటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై తాను ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరినట్టు చెప్పారు.
Related Video Embedded from HMTv Youtube Channel.