తెలంగాణలో మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.
నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.
జీహెచ్ఎంసీ ప్రధాన కాంగ్రెస్ అభ్యర్థిగా డా.జి.చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా సయ్యద్ ఫరిదుద్దీన్, అడపా సురేందర్ లు నామినేషన్లు దాఖలు చేశారు.
కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకు నామపత్రాలను సమర్పించారు.
ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
కాగా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లను ఆన్ లైన్ విధానంలో స్వీకరించడం ఉండదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ స్పష్టం చేశారు.