ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాలి: హరీశ్‌ రావు

242
Congress did not give minimum respect PV: Harish Rao

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

బుధవారం మెదక్‌ జిల్లా కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు.

విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో పాఠశాలలో పరిస్థితులు, చదువులు సాగుతున్న తీరుపై మంత్రి ఆరా తీశారు.

విద్యార్థుల ప్రతిభా పాఠవాలను పరీక్షించేందుకు పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాలలో మరిన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.