మరో పేరు బయట పెట్టిన శ్రీరెడ్డి

2089
sri-reddy-alleged-vakada-appa-rao-harassed-female-artists

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని, తాను కూడా బాధితురాలినేనంటూ పోరాటం సాగిస్తోన్న నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని టాలీవుడ్‌లో కొందరు వ్యక్తులు ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలు నాశనం చేస్తున్నారని టాలీవుడ్‌లో శ్రీరెడ్డి మరో బాంబు పేల్చారు. పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించారు.


‘వాకాడ అప్పారావు వందలాది మంది మహిళా ఆర్టిస్టులను వేధించాడు. 16 సంవత్సరాల చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టలేదు. మెగాస్టార్ చిరంజీవిగారు.. ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి’ అంటూ విజ్ఞప్తి చేస్తూ శ్రీరెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా, తన ట్వీట్‌కు వాకాడ అప్పారావు ఫొటోను సైతం శ్రీరెడ్డి జత చేయడం గమనార్హం.

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, తనకు చాలా అన్యాయం జరిగిందంటూ నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు గతవారం ఫిల్మ్ ఛాంబర్ ఎదుట శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనకు దిగి ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ విషయాలను బహిర్గం చేశారు. శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎత్తివేస్తూ.. ఆమెతో ఎవరైనా నటించవచ్చునని గురువారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.