పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీని ఆ పదవి నుంచి తప్పిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామి స్పందించారు. గత నాలుగేండ్లుగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సమస్యలు ఎదుర్కొందని తెలిపారు.
పాలనలో తలదూరుస్తూ ప్రభుత్వానికి ఆమె రోజుకో సమస్య సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం పార్టీ నేతలతో కలిసి స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆమెపై చర్యలు తీసుకునేందుకు మేం చేసిన ప్రయత్నాలు ఫలించాయని పేర్కొన్నారు.
పుదుచ్చేరిలో ప్రజలు సెక్యులర్ పార్టీలనే కోరుకుంటున్నారని అన్నారు. మతపరమైన అంశాలకు రాష్ట్రంలో చోటులేదని ఆయన స్పష్టం చేశారు.
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుస రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ ఉత్తర్వులు జారీచేశారు.