ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.
వారణాసి నుంచి జౌనపుర్ వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకొంది.
జౌనపుర్ జిల్లా జలాల్‌పుర్ సమీపంలో ట్రక్కు – జీపు ఢీకొన్నాయి.
దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణికుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపద్దవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు.