ఓయూ పరీక్షల షెడ్యూల్ విడుదల

182

ఉస్మా‌నియా యూని‌వ‌ర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

ఈ మేరకు పరీక్షా తేదీ‌లు ఖరారు చేసి‌నట్లు కంట్రో‌లర్‌ ఆఫ్‌ ది ఎగ్జా‌మి‌నే‌షన్స్‌ శ్రీరాం వెంక‌టేశ్‌ ఒక ప్రక‌ట‌నలో తెలి‌పారు.

బీఈ (ఏ‌ఐ‌సీ‌టీఈ) రెండో, నాలుగో సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌, మూడో సెమి‌స్టర్‌ మెయిన్‌, బ్యాక్‌‌లాగ్‌, అయిదో సెమి‌స్టర్‌ మెయిన్‌, మొదటి సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌ తది‌తర పరీ‌క్షలు వచ్చే నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

బీఫా‌ర్మసీ పరీ‌క్షలు వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్లు పేర్కొ‌న్నారు.

పరీక్షా తేదీల పూర్తి వివ‌రా‌లను ఓయూ వెబ్‌‌సైట్‌ www.osmania.ac.in లో అందు‌బా‌టులో ఉంచి‌నట్లు పేర్కొ‌న్నారు.