మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు అమలవుతున్నప్పటికే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా రాజస్థాన్‌లో ఓ మైనర్ బాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
చురు జిల్లాలోని సదర్‌షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 8న ఓ బాలికను కిడ్నాప్ చేశారు.
అనంతరం శివారు ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు సదర్‌షహర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దాడికి పాల్పడ్డ నిందితులిద్దరిని అరెస్టు చేశారు. వారిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు.
వీరిద్దరిపై నిర్భయ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.