సినిమా పరిశ్రమలోని మేకవన్నె పులుల, మహిళల్ని పీక్కుతినే రాబందుల గురించి ఇప్పుడు శ్రీరెడ్డి ఘటన ప్రపంచానికి చాటింది. సినీ పరిశ్రమలో జరగరానివి జరుగుతున్నాయని హీరోయిన్ మాధవీలత, గాయత్రీ గుప్తా ఎప్పట్నుంచో చెప్తున్నారు. అవును ‘క్యాస్టింగ్ కౌచ్’ ఊహించని స్థాయిలో ఉందని మరికొందరు ఆర్టిస్టులు, బాధితులు గొంతు కలిపారు. ఇందులో భాగంగా మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఈ రోజు (ఆదివారం) సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ అంశంపై చర్చా వేదికను నిర్వహిస్తున్నారు. చర్చావేదికలో పాల్గొనవలసిందిగా ఈ మేరకు ఆలోచనాపరులు, సానుభూతిపరులు, మీడియా అందరికీ ఆహ్వానం పంపించారు.