వరంగల్ లో యువతిపై పెట్రోల్‌ తో దాడి

592

వరంగల్ నగరంలోని హన్మకొండలో దారుణం చోటు చేసుకున్నది.

హన్మకొండ లోని నాయిమ్ నగర్ వాగ్దేవి కాలేజీ దగ్గరలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న రవళి అనే అమ్మాయి మీద ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కొద్దిసేపటి క్రితం ఈ సంఘటన జరిగింది.




కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిపై నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. యువతిని కాపాడేందుకు యత్నించిన వారిని దుండగుడు బెదిరించాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. యువతిని వెంటనే ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతిని రవళిగా గుర్తించారు. రవళిపై పెట్రోల్‌తో దాడి చేసిన యువకుడిని అవినాష్‌గా గుర్తించారు.

అమ్మాయి పరిస్థితి విషమంగా వుంది. 80% అమ్మాయి కాలినట్లు సమాచారము.  వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలింపు.

సంఘటన స్థలానికి చేరుకున్న హన్మకొండ ఏసీపీ చంద్రయ్య

ప్రేమను నిరాకరించినందుకే..

తన ప్రేమను నిరాకరించినందుకే రవళిపై అవినాష్‌ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అవినాష్‌ వాగ్దేవి కాలేజీలో బీకామ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. రవళి కూడా అదే కాలేజీలో బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. రవళిది సంగెం మండలం రామచంద్రాపురంగా పోలీసులు గుర్తించారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది