పశ్చిమబెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాజాకీయం వేడెక్కింది.
ప్రత్యర్థుల బాంబు దాడులతో రాష్ట్రం రణరంగంగా మారుతున్నది.ప్రతిరోజు ఏదో ఒకచోట బాంబులతో పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా పశ్చిమ మేదినీపూర్ జిల్లా అభిరామ్‌పురంలో నలుగురు టీఎంసీ కార్యకర్తలు రోడ్డు పక్కన ఉన్నారు.
మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు వారిపై బాంబులు విసిరారు. అనంతరం వారిపై కాల్పులు జరిపారు.
ఈ దాడిలో సౌవిక్ దొలాయ్ అనే వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయాపడ్డవారిని మిడ్నాపూర్ మెడికల్ కాలేజీకి తరించి వైద్యం అందిస్తున్నారు. ఈ దాడివెనుక బీజేపీ హస్తం ఉన్నదని స్థానిక టీఎంసీ నాయకులు ఆరోపిస్తున్నారు.