తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హైకోర్టు అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణిల దారుణ హత్యకు గురైన సంగతి తెల్లిసిందే.
ఈ దారుణ హత్య దృశ్యాలను టీవీల్లో చూసిన నాగమణి తల్లిదండ్రులు న్నీటిపర్యంతమయ్యారు.
ఆసుపత్రి వద్ద తమ కుమార్తె మృతదేహాన్ని చూసిన నాగమణి తల్లిదండ్రులు బోరున విలపించారు.
శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన రమణమూర్తి, జానకిల కుమార్తె అయిన నాగమణి.. కొన్నేళ్లుగా తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
అక్కడే న్యాయవాద వృత్తిలో ఉన్న మంథనికి చెందిన వామన్‌రావును ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరిని దారుణంగా హత్య చేసిన దృశ్యాలను టీవీల్లో చూసిన నాగమణి తల్లిదండ్రులు గురువారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఈ ఘటన గురించి పోలీసులు కనీసం తమకు సమాచారమైనా ఇవ్వలేదని వారు మీడియాతో వాపోయారు.
హత్య దృశ్యాలను టీవీల్లో చూసి చూసిహుటాహుటిన పెద్దపల్లికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.