ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు హైదరాబాద్ క్రికెటర్లకు స్థానం కల్పించకపోవడంతో విమర్శలు వెల్లు విరుస్తున్నాయి.
ఈ టీం లో ఒక్కరిని కూడా తీసుకోక పోవడంపై భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ సన్ రైజర్స్ తీరుపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజాగా సన్ రైజర్స్ తీరుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు.
సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాద్ ఆటగాళ్లకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.
మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన వార్నర్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడని, స్థానిక ఆటగాళ్లకు స్థానం లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాదులో సత్తా ఉన్న క్రికెటర్లకు కొరత లేదని అన్నారు. సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాదు ఆటగాళ్లు లేకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా హైదరాబాదు ఆటగాళ్లకు సన్ రైజర్స్ టీమ్ లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతై ఫ్రాంచైజీ పేరైనా మార్చుకోవాలని స్పష్టం చేశారు.
ఇదే తీరు కొనసాగితే హైదరాబాదులో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని హెచ్చరించారు.