30 రూపాయలు అడిగిన భార్యకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన భర్త

362
wife ask 30 rupees

కూరగాయలు కొనేందుకు భార్య 30రూపాయలు అడిగిందని భర్త స్రూడ్రైవరుతో కొట్టి ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా నగరంలోని రావోజి మార్కెట్ ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన జూన్ 29 న జరిగింది. రావూజీ మార్కెట్ ప్రాంతానికి చెందిన సాబీర్(35), జైనబ్‌లు(30) భార్యాభర్తలు.వారికి ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు.

శనివారం సాయంత్రం కూరగాయలు కొనేందుకు 30రూపాయలు ఇవ్వాలని జైనబ్ భర్తను కోరింది. అంతే భార్య జైనబ్ ను భర్త సాబీర్ స్రూ డ్రైవరుతో కొట్టి ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు. జైనబ్ మాట్లాడుతూ భర్త సబీర్, బావమరిది జాకీర్ మరియు ఇద్రిస్, మరదలు సామ మరియు అత్త నజ్జో నన్ను కొట్టారు. వారు నాకు తీగతో విద్యుత్ షాక్‌లు కూడా ఇచ్చారు. నా ముఖం మీద ఉమ్మివేసి నన్ను ఇంటి నుండి గెంటేసారు అని ఆమె ఆరోపించింది.

తన కుమార్తెను గతంలోనూ అల్లుడు కర్రతో తలపై కొట్టాడని, అత్తింటివారు కూడా వేధించారని జైనబ్ తండ్రి చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ పై ఇచ్చిన ఫిర్యాదు మేర దాద్రీ పోలీసులు సాబీర్ తోపాటు ఆయన తల్లి నజ్జో, సోదరి షమాలపై ఐపీసీ 498 ఎ, 506, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాఖ్ పై ఫ్యామిలీ కోర్టుకు నివేదించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి నీరజ్ మాలిక్ చెప్పారు.