దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో సుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన పొరుగు రాష్ట్రం కర్ణాటక ఆంక్షలు విధించింది.
కేరళ నుంచి వచ్చే వాహనాలపై నిషేధం విధించింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం స్తంబించిపోయింది.
దీంతో విద్యార్థులు, రోగులు, నిత్యావసరాలతో వెళ్లే ట్రక్కు డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
కర్ణాటక ఆంక్షలతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా విద్యార్థులు, రొగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని లేఖలో ప్రస్తావించారు.
ఈ విషయంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించడం కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్నారు.