అనంతపురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిపత్రి అనంతపురంలో తమకు తిరుగులేదు అంటారు జేసి బ్రదర్స్ .. సంచలనాలు అంచనాలు మార్చేలా వారు కామెంట్లు చేస్తుంటారు… పార్టీలో ఉండి తెలుగుదేశం పై కూడా కామెంట్లు చేయడం వారికే సాధ్యం.. ఆసాహసం చేసేది కేవలం జేసి బ్రదర్స్ అనేది అందరికి తెలిసిందే.. అన్న అనంతపురం ఎంపీగా, తమ్ముడు తాడిపత్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.. ఇక గతంలో తాను రాజీనామా చేస్తాను అని ప్రటకన చేసి, తెలుగుదేశాన్ని పరుగులు పెట్టించారు జేసి దివాకర్ రెడ్డి..
అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను అని, ఇప్పటికే ఎంపీ జేసి దివాకర్ రెడ్డి తెలియచేశారు.. వచ్చే ఎన్నికల్లో తనయుడు జేసి పవన్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు అని చెప్పారు… అయితే ఆయన ఎంపీగా నిలబడతారా లేదా ఎమ్మెల్యేగా నిలబడతారా అనేది ఇంకా తెలుగుదేశం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. తాజాగా ఆయన సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి కూడా సంచలన కామెంట్లు చేశారు తన పొలిటికల్ ఫ్యూచర్ పై.
వయసు మీద పడుతోందని, ఆరోగ్యం కూడా సహకరించడంలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీచేయనని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు… దీంతో జిల్లా నియోజకవర్గంలో ఇదే అంశం చర్చకు వస్తోంది.. నియోజకవర్గమంతా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని వారి అభివృద్ధికి కృషిచేయడం, ఇక తనకు సాధ్యం కాదన్నారు ఆయన . ఇలాంటి పరిస్థితుల్లో ఉత్సవ విగ్రహంలా ఉండడం తన మనసుకు నచ్చదన్నారు. కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీచేసి ఏదో ఒక వార్డుకు ప్రాతినిధ్యం వహించి అభివృద్ధికి కృషిచేస్తానని స్పష్టం చేశారు. ఇక ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఆయన రాజకీయంగా అరంగేట్రం చేయించడానికి రెడీ అవుతున్నారు అని అంటున్నారు.. అయితే ఆయన కుమారుడు ఇప్పటికే తాడిపత్రి మున్సిపల్ మెంబర్ గా అక్కడ ప్రజలకు సుపరిచితుడు అవడం ఆయన ఎంట్రీ పక్కా అనేది ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది.