
విమర్శలు, తిట్లు, అవమానాలు ఎదుర్కొని… అన్న పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడానికి బయలుదేరిన తమ్ముడు పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయం చేయడానికి ఏపీలో శాయశ్శక్తులా ప్రయత్నం చేస్తున్నారు.
ఈరోజుతో నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఆ పార్టీ అభ్యర్థులు పొత్తులు మినహా మిగతా అన్ని చోట్లా నామినేషన్లు దాఖలు చేశారు. ఇపుడు ఇక ప్రచారమే మిగిలి ఉంది. ఓటర్లను ఈ కొత్త పార్టీ ఎంత మేరకు ఆకట్టుకుంటుంది.
ఎంతమేరకు విశ్వాసం సంపాదించుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పారుతున్న ఈ కాలంలో జనసేన చాలాచోట్ల ప్రత్యర్థులను తట్టుకోవడం చాలా కష్టమే. క్యాడర్ పరంగా, పార్టీ నిర్మాణం పరంగా ఇంకా బలహీనంగా ఉంది. మరి జనం పవన్ ని చూసి ఓట్లేసి ఆశీర్వదిస్తారా? ఆయనను అసెంబ్లీకి పంపుతారా? లేక ఆయనకు ఇంకా కొంత బలగాన్ని ఇచ్చి పంపుతారా అన్నది చూడాలి.
అయితే, ఎవరు ఎలా ఊహించుకున్నా, ఏమనుకున్నా… మేము మాత్రం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆ పార్టీ అంటోంది. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో కళ్యాణ్ గారే నిలబడలేకపోవొచ్చు, కానీ ప్రతి చోట నిలబడేది మాత్రం ఆయన ఆశయాలే!జనసేన సిద్దాంతాలే! అంటూ ఒక కొత్త పాటను విడుదల చేసింది. అది అందరినీ ఆకట్టుకుంటోంది. కొన్ని నిమిషాల క్రితం (సోమవారం అర్ధరాత్రి) ఆ పాట రిలీజయినా బాగా వైరల్ అవుతోంది.