హైదరాబాద్ నగరంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని ఉన్నత చదువులు చదవలేక పోతున్నానని మనస్తాపం చెంది, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.
ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శారదా నగర్లో ప్రవల్లిక అనే విద్యార్థిని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులు చదవలేక పోతున్నాననే మనస్తాపంతో ఉరేసుకుని చనిపోయిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
కుటుంభ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.