ఫ్రెండ్ అమాయకత్వాన్ని వాడుకొని .. అతని భార్యతో అఫైర్

336
extra marital affair with friend wife

సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగానే చాలా దారుణాలు జరుగుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉంటున్న వారిని చంపేయడం.. లేదా వాళ్లే చనిపోవడం వంటివి ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువైపోయాయి. ఇటీవల కృష్ణా జిల్లాలో జరిగిన సంఘటన కూడా ఈ కోవలోకే వస్తుంది. కృష్ణా జిల్లా వేలేరు గ్రామానికి చెందిన బొబ్బిలి డేనియల్‌ అలియాస్‌ బాలు ఊక లారీపై పని చేస్తుంటాడు. అతడి పాటే పని చేసే రాజాబాబు అనే వ్యక్తి చాలా అమాయకుడు. అసలు ఫోన్ వాడడం కూడా తెలీదు.




 

అందుకే అతడు ఫోన్ కూడా వాడేవాడు కాదు. అందుకే బాలు దగ్గర ఫోన్ తీసుకుని తన భార్యతో మాట్లాడేవాడు. ఇదే అవకాశంగా తీసుకున్న బాలు.. ఆమెకు ఫోన్ చేసి మాటలు కలిపాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఏకాంతంగా కలిశారు. ఈ విషయం రాజాబాబుకు తెలియడంతో వాళ్లిద్దరినీ హెచ్చరించాడు. గత నెల 23న పని నుంచి రాజాబాబును వేలేరు పరిధిలోని పోలవరం కాలువ సమీపంలోకి తీసుకెళ్లి మద్యం తాగించి ఆ తరువాత కొట్టి చంపేశాడు. దీనిని హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు ఛాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.