అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ గృహ రుణాలు తీసుకునేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది.
హోమ్‌లోన్ పై వడ్డీరేటును వడ్డీరేటును 6.70 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
మార్చి 31 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేటును 6.70 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
దీంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా వడ్డీ రేటును 6.65 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సైతం వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది.
సవరించిన వడ్డీ రేట్లు మార్చి 5 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
రూ.75 లక్షల వరకు రుణాలపై 6.70 శాతం; ఆపై మొత్తాలకు 6.75 శాతం వడ్డీరేటు వర్తిస్తుందని ఐసీఐసీఐ తెలిపింది.
గత కొన్ని నెలలుగా హోమ్‌లోన్ కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని సంస్థ వెల్లడించింది.