హైదరాబాద్ లో మొట్టమొదటి ఫుడ్ డెలివరీ ఉమెన్

1070
first food delivery woman
Hyderabad first food delivery woman

మీ స్విగ్గి ఆర్డర్‌ను మహిళా డెలివరీ ఏజెంట్ మీకు అందిస్తే ఆశ్చర్యానికి గురవుతారు కదూ.. విల్లా మేరీ కాలేజీకి చెందిన 21 ఏళ్ల జనని రావు బంజారా హిల్స్ , జూబ్లీ హిల్స్ మరియు సోమజిగుడల సందులలో తిరిగి ఫుడ్ డెలివరీ చేసేటపుడు అందరు ఇలాగె ఆశ్చర్యపోతున్నారు. ఈవిడ సైకాలజీ మరియు మాస్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్. అలంటి అమ్మాయి ఇలా ఫుడ్ డెలివరీ చేయటం మరీ ముఖ్యంగా పురుషాధిఖ్య ప్రపంచం లో ఈ విషయం చాలా మందిని ఆశ్చర్య పరుస్తుంది.

“ఫుడ్ డెలివరీ బాయ్..ఇప్పుడు సిటీలో హాట్ ఫేవరేట్ జాబ్. ఈ రంగంలోకి కొత్తగా అమ్మాయిలు కూడా ప్రవేశిస్తున్నారు. జననీ రావు అనే 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్ లో మొట్టమొదటి ఫుడ్ డెలివరీ ఉమెన్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. రెండున్నర నెలలుగా ఈ ఉద్యోగం చేస్తున్నానని తనకు ఇది పెద్ద కష్టంగా అనిపించడం లేదని చెబుతున్నారామె. ఫీల్డ్ లో ఎంతోమందిని కలవడం హ్యాపీగా ఉందంటున్నారు. జాబ్ ఏదైనా జాబేనని దాంట్లో చిన్నా, పెద్ద ఉండదంటోందీ డేర్ అండ్ డాషింగ్ గర్ల్.

జనని మాట్లాడుతూ ఈ ఉద్యోగం చేయడానికి ప్రధాన కారణం ఛాలెంజింగ్ గా భావించే ఇటువంటి ఉద్యోగాలను చేసే మహిళల చుట్టూ ఉన్న సామాజిక సమస్యలను తెలియజేయడం కోసమే. “నేనెప్పుడు స్త్రీలు ఫుడ్ డెలివరీ చేయడాన్ని చూడలేదు. ఇది అసాధారణమైనదే కానీ ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే ..అది నేను చేసాను, ”అని చెప్పారు.

సమాజంలో విద్యావంతులు, ఉన్నత స్థాయి నుండి వచ్చే వారి పిల్లలు ఇలాంటి ఉద్యోగాలు చేయటం మింగుడు పడని విషయం అని చెప్పారు. నేను కార్పొరేట్ ఉద్యోగుల కుటుంబం నుండి రావడం, సైకాలజీ గ్రాడ్యుయేట్ కావడం , సమాజం ఒక వృత్తిని ఎలా గౌరవిస్తుంది వారి శ్రమను ఎలా సమంగా చూస్తుంది అనే విషయాలు అందరికి తెలియాలని కోరుకుంటున్నాను.

Also Read : జొమాటోలో 10,000 ల కొత్త ఉద్యోగాలు

“ఈ ఉద్యోగాన్ని చేయడానికి స్విగ్గి మహిళలను అనుమతిస్తుందా అని అందరూ నన్ను అడుగుతుంటారు. చాలా మంది ప్రజలు మెచ్చుకుంటున్నారు, నేను మంచి పని చేస్తున్నానని మరియు అమ్మాయిలు ఆహారాన్ని పంపిణీ చేయడాన్ని చూడటం ఆనందంగా ఉందని వారు నాకు చెబుతూనే వుంటారు. తన నిర్ణయాలకు తన కుటుంబం మరియు స్నేహితులు ఎంతో సహకరించారని, వారు ఎంతో గర్వంగా వున్నారని చెప్పారు.

ఉద్యోగంలో ఉన్న మహిళల భద్రత గురించి మాట్లాడుతూ, స్విగ్గి వారు మమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి పెప్పర్ స్ప్రేలను అందించారు. మరియు ఎమర్జెన్సీ సేఫ్టీ యాప్ ద్వారా స్విగ్గి ఎమర్జెన్సీ సెల్ కి కనెక్ట్ అయ్యి ఉంటాము . మంచి చర్యలు తీసుకున్నారని ఆమె చెప్పారు.