కరోనా వ్యాప్తిని కట్టడి చేసి రాష్ట్ర ప్రజల ప్రాణాల రక్షణకోసమే లాక్ డౌన్ ను సిఎం కేసీఆర్ ప్రకటించారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని స్థానిక 5 ఇంక్లైన్ వద్ద ఆటోవాలాలకు నిత్యవసరాలు, బియ్యంను ఎమ్మెల్యే చందర్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఆటోలు నడుపతూ తమ కుటుంబాలను పోషించుకునే ఆటోడ్రైవర్స్ కు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువైయ్యిందన్నారు.
నిరు పేదలకు అర్థాకలి కష్టాలుండవద్దని తెల్లకార్డు కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 12కేజీల బియ్యతో పాటు 1500 నగదు అందించడం జరిగిందన్నారు. రామగుండం నియోజవర్గంలోని నిరుపేదలను ఆదుకోవాలని విజయమ్మ పౌండేషన్ ద్వారా నిత్యవసరాలు, బియ్యం పంపిణితో పాటు నిత్యం అన్నదానం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్ దోంత శ్రీనివాస్, నాయకులు మారుతి, బోడ్డు రవీందర్, చెరుకు బుచ్చిరెడ్డి, నీలి నందు తదితరులు పాల్గొన్నారు.