జాగ్రత్త… మీ స‌మాచారాన్ని దొంగలిస్తున్న 29 యాప్స్‌ ఇవే

305
data stealing

ఫొటోలు అందంగా క‌నిపించాల‌నే ఉద్దేశంతో ఫొటో ఎడిటింగ్ లేదా బ్యూటీ యాప్స్ వాడుతున్నారా? అయితే అవి మీకు తెలియ‌కుండానే మీ స‌మాచారాన్ని మొత్తం దొంగిలిస్తున్నాయ‌ట‌. అందుకే గూగుల్ సంస్థ త‌న ప్లే స్టోర్ నుంచి 29 యాప్‌ల‌ను తొల‌గించింది.




మ‌నం ఫొటోలు దిగుతున్న‌ప్పుడు అందంగా క‌నిపించ‌డానికి బ్యూటీ యాప్స్‌, మ‌న గ్యాల‌రీలోని ఫొటోల‌కు మెరుగులుదిద్దేందుకు ఫొటో ఎడిటింగ్ యాప్‌ల‌ను వినియోగిస్తున్నారా? అయితే మీరు జాగ్ర‌త్త‌గా ఉండండి. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్, బ్యూటీ యాప్స్ వినియోగ‌దారుల డేటాను చోరీ చేస్తున్నాయట. స్వ‌యంగా గూగుల్ సంస్థే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అంతేకాదు.. భద్రతా కారణాల రీత్యా 29 యాప్స్‌ను తొలగించినట్టు వెల్లడించింది. వీటి ద్వారా వినియోగ‌దారుల డేటాకు భారీ ప్రమాదం పొంచి ఉంద‌ని, ఈ నివేదికల ఆధారంగా తొల‌గించామ‌ని గూగుల్ చెప్పింది.
ఎందుకు?
* ఈ యాప్‌లు యూజ‌ర్ల‌కు క‌నీసం ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా ఫుల్ స్క్రీన్ యాడ్స్ ఇస్తున్నాయి.

* కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసే పాప‌ప్‌లు, కుకీస్‌తో పోర్నోగ్ర‌ఫీ వెబ్‌సైట్ ప్లేయ‌ర్లు డౌన్‌లోడ్ అవుతున్నాయి.

* కొన్ని యాప్స్ వినియోగ‌దారుల ఫొటోల‌ను, ఇత‌ర స‌మాచారాన్ని త‌మ స‌ర్వ‌ర్‌లో నిల్వ చేసుకుంటున్నాయి. వీటి గురించి యూజ‌ర్ల‌కు స‌మాచారం ఇవ్వ‌డం లేదు.

* వినియోగ‌దారుల ఫోన్ నంబ‌ర్లు, మెయిల్ ఐడీలు, అడ్ర‌స్‌లు సేక‌రిస్తున్నాయి.

* కొన్నింటిలో ఆన్‌లైన్ పేమెంట్ ఆప్ష‌న్ ద్వారా వినియోగ‌దారుల డెబిట్, క్రెడిట్ కార్డుల వివ‌రాలు సేక‌రిస్తున్నాయి. వాటిని దుర్వినియ‌గం చేస్తున్నాయి.

* ఈ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయగానే యూజ‌ర్ల‌కు ఎలాంటి సందేహం రాకుండా.. క‌నీసం వారు గుర్తించలేనంతగా ఒక షార్ట్‌కట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. దీంతో వీటిని తొల‌గించ‌డం కూడా క‌ష్టం అవుతోంది.

భార‌త్‌లో ల‌క్ష‌ల డౌన్‌లోడ్‌లు
గూగుల్ తొల‌గించిన 29 యాప్‌ల‌కు భార‌త్‌లో మంచి డిమాండ్ ఉంద‌ని గూగుల్ తెలిపింది. ల‌క్ష‌లాది మంది వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటున్నార‌ని చెప్పింది. ప్రో కెమెరా బ్యూటీ, కార్టూన్ ఆర్ట్ వంటివి మిలియ‌న్ల డౌన్‌లోడ్‌లు ఉన్నాయ‌ని చెప్పింది. ఈ యాప్స్ హానిక‌ర‌మైన మాల్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి పంపిస్తున్నాయ‌ని తెలిపింది.

గూగుల్ తొల‌గించిన యాప్స్ ఇవే..
– Pro Camera Beauty

– Cartoon Art Photo

– Emoji Camera

– Artistic effect Filter

– Art Editor

– Beauty Camera

– Selfie Camera Pro

– Horizon Beauty Camera

– Super Camera

– Art Effects for Photo

– Awesome Cartoon Art

– Art Filter Photo

– Art Filter Photo Effcts

– Cartoon Effect

– Art Effect

– Photo Editor

– Wallpapers HD

– Magic Art Filter Photo Editor

– Fill Art Photo Editor

– ArtFlipPhotoEditing

– Art Filter

– Cartoon Art Photo

– Prizma Photo Effect

– Cartoon Art Photo Filter

– Art Filter Photo Editor

– Pixture

– Art Effect

– Photo Art Effect

– Cartoon Photo Filter