బడుగు, బలహీన వర్గాలలో తమ వారి కోసం, సమాజం కోసం పని చేసే వారిని గుర్తించి వారిని గౌరవించాలనే ఉద్దేశంతో సాంబారి ప్రభాకర్ ఆధ్వర్యంలో జన అధికార సమితి సబ్బండ వర్గాల సమ్మేళనం ను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 29 శనివారం ఉదయం 9 గంటల నుండి మెట్ పల్లి మార్కెట్ రోడ్ లో గల వాసవి గార్డెన్ లో ఈ సమ్మేళనం జరుగును.
ఈ కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ వెబినార్ ద్వారా తమ సందేశాన్ని అందిస్తారు. వివిధ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రముఖులకు సన్మాన కార్యక్రమం తో పాటు గడ్డం రమేష్ బృందం చే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడును.
ఈ కార్యక్రమంలో జన అధికార సమితి ప్రెసిడెంట్ చేరాలా నారాయణ , సెక్రటరీ కృష్ణమూర్తి, పరికిపండ్ల రామ్ , మున్నూరుకాపు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మల్కా రామస్వామి, కన్నం తిరుపతి, కీర్తి నాగార్జున, మహేష్ పటేల్, మరియు ఆలయ ఫౌండేషన్ CEO రమేష్ బాబు, కార్య నిర్వాహకులు రాజేందర్ , BICCI ప్రతినిధులు కృష్ణమూర్తి, నరేందర్, సెక్రటరీ దాసరి కిరణ్ తదితరులు పాల్గొంటారు.