400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం

307
free-wifi-in-400-railway-stations

డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే శాఖ రైల్‌టెల్ సహకారంతో 2016 జనవరిలో తొలిసారిగా ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. భారత రైల్వే శాఖ అనుబంధ టెలికాం సంస్థ రైల్‌టెల్ సాయంతో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఉచిత వైఫై సేవల కల్పనకు భారత రైల్వే 2015లో గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వైఫై సేవలను ప్రారంభించిన తొలి ఏడాది 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసును అందించారు. ఇవాళ అసోంలోని డిబ్రుగఢ్ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై ఏర్పాటుతో రైల్వేస్టేషన్ల సంఖ్య 400కు చేరింది.