ఈరోజు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ చిలుక రవీందర్ గారి అధ్యక్షతన సమావేశం మరియు వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆయిల్ ఫామ్ సాగు గురించి సమీక్ష సమావేశాలు జరిగినవి.
ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అధ్యక్షులు గారు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తూకంలో హెచ్చుతగ్గులు లేకుండా చూడాలని, వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారి గారు సర్టిఫై చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకునే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని. రైతులకు ఇబ్బందులు లేకుండా స్థలాలలో తగు నీరు, నీడ కల్పించాలని తెలిపారు.
ప్రస్తుతం ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతకు వడగాల్పులు వీచుచున్నందున ఉపాధి హామీ కూలీలు మధ్యాహ్నం లోపు పనులు పూర్తి చేసుకోవాలని, వారికి తగు చర్యలు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కోరారు మరియు మండలంలో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయడానికి తగు సౌకర్యం ఉన్నందున రైతులను ఆయిల్ ఫామ్ తోటలను పెంచేందుకు తగు సౌకర్యాలు కల్పించి నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాలని తెలిపారు.
ఇట్టి కార్యక్రమానికి తహసిల్దార్ శ్రీమతి రజిత గారు, ఎంపీడీవో శ్రీమతి స్వరూప గారు, ఏ ఎం సి చైర్మన్ గడ్డం చుక్కా రెడ్డి గారు, ప్యాక్స్ చైర్మన్లు శ్రీ వేల్మా మల్లారెడ్డి మినుపాల తిరుపతి రావు గారలు, రైతు సమన్వయ అధ్యక్షులు శ్రీ గుడిపాటి వెంకట రమణారావు గారు, వ్యవసాయ అధికారి శ్రీ వంశీకృష్ణ గారు, హార్టికల్చర్ అధికారి రోహిత్, ఐకెపి ఎపిఎం నర్మదా గారు, వివిధ గ్రామాల గౌరవ సర్పంచులు ఎంపీటీసీ గారలు, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ వెల్మ శ్రీనివాస్ రెడ్డి గారు , మండలంలోని రైస్ మిల్లర్ల యజమానులు, ప్యాక్స్ , ఐకెపి ఇన్ ఛార్జ్ లు, పంచాయతీ కార్యదర్శులు మొదలగువారు పాల్గొన్నారు.