శ్రీవారి భక్తుడు, ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య జయంతి విషయంలో గందరగోళం నెలకొంది. టీటీడీ పంచాంగంలో ముద్రించిన ప్రకారం ఏప్రిల్ 29న అన్నమయ్య జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ తేదీపై తాళ్లపాక వంశస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం ఉన్నరోజున అన్నమయ్య జయంతి నిర్వహిస్తారని చెబుతున్నారు. పంచాంగం ప్రకారం 29న చిత్తా నక్షత్రం ఉందని, విశాఖ నక్షత్రం 30న మధ్యాహ్నం 2.18 గంటలకు ప్రారంభమై మే1 మధ్యాహ్నం 3.22 వరకు ఉందని, ఆ ఘడియల్లోనే అన్నమయ్య జయంతి నిర్వహించాలని కోరుతున్నారు. ఈ విషయంపై టీటీడీ అధికారులను కలిసినా స్పందించలేదని వారు తెలిపారు.