ప్రాణాలు తీసిన ముద్దు .. వీడియో

295

ముద్దుల్లో మునిగిపోయిన ప్రేమజంట ప్రమాదవశాత్తు.. 50 అడుగుల బ్రిడ్జిపై నుంచి పడి చనిపోయారు. ఈ సంఘటన పెరూ దేశంలో చోటు చేసుకుంది. మేబిత్‌ ఎస్పింజ్‌(34), హెక్టార్‌ విడాల్‌(36) అనే ఇద్దరు ప్రేమికులు పర్వతారోహకులుగా పని చేస్తున్నారు. వీరు ఇరువురు క్యూసో పట్టణంలో టూరిస్టు గైడ్లుగా కూడా సేవలందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ప్రేమజంట తమ పని ముగించుకున్న తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకు తమ నివాసాలకు బయల్దేరారు. మార్గం మధ్యలో ఈ ప్రేమికులిద్దరూ బెత్లెహాం వంతెనపై ఆగి ముద్దులు పెట్టుకుంటున్నారు.

ప్రియురాలు బ్రిడ్జి రెయిలింగ్‌పై కూర్చొని ఉండగా, ప్రియుడు ఆ రెయిలింగ్‌ను సపోర్ట్‌ చేసుకుంటూ నిలబడ్డాడు. ప్రియురాలికి ప్రియుడు ముద్దు ఇస్తున్న క్రమంలో వారిద్దరూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయారు. 50 అడుగుల పైనుంచి కిందపడిపోయేసరికి ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు.