అర్థరాత్రి కారుతో ఢీకొట్టి.. కార్పొరేటర్ దారుణ హత్య!

143

ఆంధ్ర ప్రదేశ్ లో కార్పోరేటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది.

కాకినాడలోని 9వ వార్డు కార్పొరేటర్ కంపరా రమేష్ ను దుండగులు హతమార్చారు.

గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రమేష్ పై దాడి చేశారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో కారుతో ఢీకొట్టి చంపేసినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న రమేష్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే అతను మ‌ృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాత కక్షలే కారణంగా కార్పోరేటర్ హత్యకు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.