నిన్న చొప్పదండి మండల కేంద్రంలో గత మూడు రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చీఫ్ మినిస్టర్స్ కప్, 2023 ముగింపు వేడుకలు మరియు విజేతలకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవం జడ్పిహెచ్ఎస్ బాలుర స్కూల్ చొప్పదండి నందు జరిగినవి.
ఇట్టి కార్యక్రమానికి మండల ప్రజా పరిషత్ చొప్పదండి అధ్యక్షులు శ్రీ చిలుక రవీందర్ గారు అధ్యక్షత వహించగా కరీంనగర్ జిల్లా ట్రేని కలెక్టర్ మరియు ఆర్ డి ఓ శ్రీ లెనిన్ టోప్పోగారు ముఖ్యఅతిథిగా కార్యక్రమానికి హాజరైనారు.
ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అధ్యక్షులు గారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే ఆటల పోటీలు యువతకి పాఠశాల స్థాయి విద్యార్థులకు ఎంతో ఉపయోగమని వారికి వారి భవిష్యత్తులో ఎంతో ఉపయోగమని తెలిపారు. ఇందులో గెలుపొందిన విజేతలకు జిల్లా స్థాయిలో క్రీడల పోటీలో పాల్గొనే అవకాశం ఉంది.అందులో రాణించి రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని, ఇందులో పాల్గొన్న ప్రతీ క్రీడాకారులకు పేరుపేరునా శుభాభినందనలు తెలియచేశారు.
ఇట్టి కార్యక్రమాన్ని అధికారులు శ్రద్ధతో నిర్వహించి విద్యార్థులు యువతను పాల్గొనేలా చేశారని వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరము వివిధ ఆటల పోటీలలో గెలిచిన యువతకు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అధ్యక్షులు మరియు ట్రైనీ కలెక్టర్ గారు ప్రధానం చేశారు.
ఇట్టి కార్యక్రమానికి ఎంపీడీవో శ్రీ రాజగోపాల్ గారు, తాసిల్దార్ శ్రీమతి రజిత గారు, మున్సిపల్ కమిషనర్ శాంత కుమార్ గారు, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు గారు, ఫిజికల్ డైరెక్టర్ గారు , మండల కార్యాలయ సిబ్బంది , క్రీడాకారులు మొదలగు వారు పాల్గొన్నారు.