కరోనా తర్వాత బిట్ కాయిన్ విలువను కంట్రోల్ చేయడం ఎవ్వరి తరమూ కావడం లేదు. గత రెండు నెలల్లో 25 వేల డాలర్ల నుంచి ఏకంగా 50 వేల డాలర్లను దాటేసింది.
తాజాగా 5 శాతం లాభపడి 50,602 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు ప్రతి రోజ 50,300 వద్ద ట్రేడ్ అయ్యేది.
ఈ ఏడాది ఈ క్రిప్టో కరెన్సీ 72 శాతం లాభపడింది. బిట్ కాయిన్‌లో టెస్లా కంపెనీ 1.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టిన తర్వాత దీని విలువ ఆకాశం వైపు దూసుకెళుతోంది.
మాస్టర్ కార్డ్, టెస్లా వంటి కంపెనీ ఎంపిక చేసిన క్రిప్టో కరెన్సీని మాత్రమే ఆమోదించనున్నట్టు తెలిపాయి.
ప్రపంచ మార్కెట్‌లో బిట్ కాయిన్ పరుగులు పెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దాని విలువ 50,000 డాలర్లు దాటింది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే దాని విలువ అక్షరాలా రూ. 37 లక్షల కంటే ఎక్కువ.
ఏడాది క్రితం 10 వేల డాలర్లుగా ఉన్న ఈ బిట్ కాయిన్ విలువ ప్రస్తుతం భారీగా పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఈ కరెన్సీ వైపు ఆసక్తి చూపుతున్నాయి.
అంతేకాదు అమెరికాలోని వర్జీనియాకు చెందిన బ్లూరిడ్జ్ బ్యాంక్ తమ ఏటీఎంలు, శాఖల్లో బిట్ కాయిన్ కొనుగోలు చేయవచ్చని బహిరంగంగా ప్రకటిస్తోంది.
టెస్లా కంపెనీ 1.5 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసింది. మాస్టర్ కార్డ్ సహా పలు సంస్థలు క్రిప్టోను అంగీకరిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ కూడా బిట్ కాయిన్‌కు మద్దతు తెలుపుతోంది.
డిజిటల్ ఆస్తుల జారీ, నిర్వహణ, బదిలీలకు సంబంధించి క్లయింట్స్‌కు మద్దతుగా బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ అంతర్గత విభాగాన్ని ప్రారంభించింది.
బెస్లా, మాస్టర్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ నిర్ణయాలు బిట్ కాయిన్ విలువను పరుగులు పెట్టిస్తున్నాయి.
భారత్‌లో 75 లక్షలకు పైగా పెట్టుబడిదారులు 100 కోట్ల డాలర్లకు పైగా బిట్ కాయిన్ కరెన్సీని కలిగి ఉన్నట్టు అంచనా.
ఈ విలువను మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 7,300 కోట్లు.
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెట్టేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.