ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అరెస్ట్

170
Atnennaidu arrest

ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిని అచ్చెన్నాయుడు బెదిరించారంటూ నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు నిమ్మాడలో ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ ఇలాంటి పిరికిపంద చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ఠ అని ఆయన ఆరోపించారు.

ఖండించిన తెలంగాణా తెలుగు యువత పబ్లిసిటీ సెక్రటరీ కోలి విజయ్ శేఖర్

నిమ్మాడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో వైస్సార్సీపీ ఓటమి తప్పదనే భయంతో ప్రజాస్వామ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి ఖూనీ చేసి అచ్చెంనాయుడు ను అనాగరికంగా అరెస్ట్ చేసారని తెలుగు యువత పబ్లిసిటీ సెక్రటరీ కొలి విజయ్ శేఖర్ తీవ్రంగా మండిపడ్డారు