మంగళవారం అంతర్గాం మండల బిజెపి అధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన బీజేపీ అంతర్గాం మండల కార్యవర్గ సమావేశం జరిగింది.
మండల కేంద్రం అంతర్గం లో జరిగిన ఈ సమావేశానికి పెద్దపల్లి జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు గడ్డం మహిపాల్ రెడ్డి గారు బిజెపి శాఖ నుండి ప్రత్యేక పరిశీలకులుగా హాజరైనారు.
ఈ కార్యక్రమంలో మాడ నారాయణ రెడ్డి మాట్లాడుతూ అంతర్గాం మండల గ్రామాల సాగునీటి సమస్యలు మరియు ప్రజలు ఎదురుకునే ఇబ్బందుల గురించి వివరించడం జరిగింది. మండలం లోని ఒక్క గ్రామానికి కూడా అభివృద్ధి ఫలాలు అందలేదని అన్నారు. మండల ప్రజలు ఎమర్జెన్సీ కేసులు ఉన్నపుడు రైల్వే గేట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భము ఉందన్నారు.
ఈ సందర్భంగా మండలం లోని ప్రతి గ్రామంలో గల సమస్యలను మండల కార్యవర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది.
ఈ సమావేశంలో బీజేపీ మండల ప్రధానకార్యదర్శి లు బోడకుంట సుభాష్, బుషిపక సంతోష్ మండల బీజేపీ కమిటి ఉపాధ్యక్షులు లగిశెట్టీ తిరుపతి, గంగదరి శ్రీనివాసగౌడ్, కోశాధికారి ఆవుల విజయ్ పాల్, కార్యదర్శి బండిపెల్లి చంద్రయ్య, తమ్మనవేని మల్లేష్, దళిత మొర్చా ప్రధాన కార్యదర్శి తుల్ల సతీష్, కార్యవర్గ సభ్యులు ఆరుముళ్ళ శ్యామ్, సభ్యులు, బూత్ అధ్యక్షులు, మరియు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు..