కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అంగన్‌వాడీ టీచర్‌ మృతి

191
Two elderly people died corona vaccine

దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న టి.నారాయణమ్మ(58) అనే అంగన్‌వాడీ టీచర్‌ గురువారం మృతి చెందింది.

ఈ ఘటన ఏపీలోని పులివెందులలో చోటుచేసుకొంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం నారాయణమ్మ రెండు వారాల క్రితం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంది.

వ్యాక్సిన్‌ వేయించుకున్న రెండో రోజు జ్వరం రావడంతో ఆమె ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందింది.

టైఫాయిడ్‌ జ్వరంగా వైద్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.

రిమ్స్‌ ఆసుపత్రిలో కూడా ఆమెకు జ్వరం తగ్గకపోవడంతో గురువారం ఇంటికి తీసుకొచ్చారు.

ఇంటికి వచ్చిన గంటలోపే ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వికటించడం వల్లే ఆమె మృతి చెందిందని కుటుంభ సభ్యులు ఆరోపించారు.