ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. అందులో భాగంగా వారు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంటనే కస్టమర్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా ఇవ్వాలి.. అనే వివరాలు ఉంటాయి. వాటిని నమోదు చేస్తే కస్టమర్ తన ఫోన్ లో ఎయిర్‌టెల్ యాప్ నుంచి పాలసీ కాపీని పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భారతీ ఆక్సా నుంచి ఆ పాలసీ ఇష్యూ అవుతుంది.
కాగా రూ.249 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ టీవీ ప్రిమియం సేవలు జీ5, హూక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్, లైవ్ చానల్స్, సినిమాలు, 1 ఏడాది కాల వ్యవధి గల నార్టన్ మొబైల్ సెక్యూరిటీ సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి. అయితే ఎయిర్‌టెల్ రూ.129 కు మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో కస్టమర్లకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. కాగా రూ.249, రూ.129 ప్లాన్ల వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.