ఈరోజు పెద్దపల్లి జిల్లా ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న యువకులతో ఆలయఫౌండేషన్ సభ్యులు శ్రీ పరికిపండ్ల రామ్ సమావేశం నిర్వహించి, ఏప్రిల్ 10వ తేదీ నాడు జరగబోయె శ్రీ పరికిపండ్ల సత్యనారాయణ మెమోరియల్ శంకర విజన్ సెంటర్ ( ఉచిత కంటి ఆసుపత్రి ) ప్రారంభానికి కావాల్సిన ఏర్పట్లలో పాల్గొనవలసింది గా కొరారు.
మీటింగ్ కి హాజరైన జిడి నగర్ యువత సణుకులంగా స్పందించారు మరియు ఆలయ ఫౌండేషన్ భవిష్యత్ కార్యక్రమలలో కూడా చురుకుగా పాల్గొంటామని తెలియచేసారు. ఈ సమావేశం లో చైతన్య, నవీన్, సంతోష్, సాగర్, రాకేష్, తిరుపతి, సందీప్, రాజారాం, వంశీ, సాయి కిరణ్, సాయి కుమార్, కృష్ణ, శ్రవణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.