ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు.
కుప్పంలో డబ్బు పంచి వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. కుప్పం జగన్ జాగీరు కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మునిసిపల్ ఎన్నికల సమయంలో కుప్పంలోనే మకాం వేస్తానని, వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని హెచ్చరించారు.
గేరు మార్చి తన తడాఖా చూపిస్తానని అన్నారు. ఇకపై వైసీపీపై జెట్ స్పీడుతో పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలు తెగించి ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ తో మంత్రి పెద్దిరెడ్డి దోచుకుంటున్నాడని ఆరోపించారు. పుంగనూరులో పెద్దిరెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని చంద్రబాబు అన్నారు.