టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.
మీడియాత్ చిట్ చాట్ సందర్భంగా సంజయ్ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేసి పొరపాటు చేయొద్దని ఆయన కోరారు. రాజకీయ స్వార్థం కోసమే కేసీఆర్ పీవీని వాడుకుంటున్నారని సంజయ్ అన్నారు.
పీవీ ఘాట్‌ను ఎంఐఎం కూల్చుతామంటే కేసీఆర్ కనీసం స్పందించలేదన్నారు. మోసం చేయటంలో కేసీఆర్ ఏక్ నంబర్కే, టీఆర్ దస్ నంబర్ అని ఎద్దేవా చేశారు. వామనరావు హత్యపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
త్వరలో కేసీఆర్‌కు సంబంధించిన సంచలన విషయం వెల్లడిస్తానని సంజయ్ కీలక ప్రకటన చేశారు. ఎంపీగా కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని అన్నారు.
స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. బీజేపీ అధిష్ఠానం అనుమతితో కేసీఆర్ బండారం బయటపెడతానని సంజయ్ వ్యాఖ్యానించారు.