రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న ‘100 శాతం పైగా క్యాష్‌బ్యాక్’ తుది గడువును ఆ కంపెనీ పొడిగించింది. మార్చి 15 వరకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ కింద రూ.398, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ యూజర్లకు లభించనుంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ కేవలం జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే. రీఛార్జ్ ఓచర్లు, వాలెట్ క్యాష్‌బ్యాక్‌ల రూపంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను జియో అందిస్తోంది. రూ.398, ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై 400 రూపాయల విలువైన ఎనిమిది ఓచర్లను కంపెనీ ఆఫర్ చేయనుందని జియో.కామ్ పేర్కొంది. ఇవి వెంటనే కస్టమర్ల అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతాయి. మైజియో యాప్‌లో ‘మై ఓచర్స్’ కింద కనిపిస్తాయి.
మిగతా 300 రూపాయలను ఫ్రీఛార్జ్, మొబిక్విక్, పేటీఎం, అమెజాన్ పే, ఫోన్‌పే వంటి డిజిటల్ వాలెట్ల ద్వారా అందిస్తోంది. మొబిక్విక్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే జియో ప్రైమ్ మెంబర్లకు రూ.300 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అదే పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకుంటే కొత్త కస్టమర్లకు రూ.80, పాత కస్టమర్లకు రూ.50 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అమెజాన్ పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటే జియో కొత్త, పాత యూజర్లకు రూ.50 క్యాష్‌బ్యాకే లభిస్తోంది. ఫోన్‌పే ద్వారా జియో కొత్త యూజర్లకు రూ.90 క్యాష్‌బ్యాక్, పాత యూజర్లకు రూ.60 క్యాష్‌బ్యాక్ అందుతోంది. ఫ్రీఛార్జ్ నుంచి కొత్త జియో యూజర్లకు రూ.75 క్యాష్‌బ్యాక్, పాత యూజర్లకు రూ.30 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.