ప్రారంభానికి సిద్ధమైన ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్

245
Traffic Training Center available soon

నల్లగొండ జిల్లా కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలతో చేపట్టిన ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభానికి సిద్దమైంది. ఈ సెంటర్ నిర్మాణ పనులు  తుది దశకు చేరుకొన్నాయి.

బుధవారం అదనపు ఎస్పీ శ్రీమతి నర్మదతో కలిసి ఇర్మాణంలో ఉన్న ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ పనులను పరిశీలించారు.

టిటిఐలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని అతి త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు.

ఈ ట్రైనింగ్ కేంద్రం ద్వారా ట్రాఫిక్ నిబంధనల పట్ల పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఆవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న్మన్నారు.

ట్రాఫిక్ సిగ్నల్స్, నిబంధనలకు సంబంధించిన చిత్రాలు, చిన్నారుల కోసం ఆట స్థలంతో పాటుగా బైక్  నడిపే సమయంలో వాహనం ఎలా నడపాలో వివరించడానికి ప్రత్యేకంగా సిమిలేటర్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే ఉన్న ఈ సౌకర్యం జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్న వారికి రోడ్డు ప్రమాదాల వీడియోలు ప్రదర్శించి వారిలో అవగాహన పెంపొందించే విధంగా కౌన్సిలింగ్ సెంటర్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.