టీవీ ఆన్ చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్‌కుంట గ్రామ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం నాగర్‌కుంట పంచాయతీ పరిధిలోని ఆమిర్‌గూడేనికి చెందిన పాండురంగం (29) మధ్యాహ్నం ఇంట్లో టీవీ పెట్టేందుకు స్వీచ్ ఆన్ చేశాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంభ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.