మహారాష్ట్రలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూనే మైదానంలోనే ఓ క్రికెటర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన రాష్ట్రంలోని పుణెలో సంభవించింది.
మృతుడిని 47 ఏండ్ల బాబు నలవాడేగా గుర్తించారు. పుణెలోని జున్నార్ తహశీల్‌లో స్థానికంగా నలవాడే మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ క్రమమలో ఒక్కసారిగా పిచ్‌పైనే కుప్పకూలిపోయాడు.
దాంతో హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అప్పటికే నలవాడే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.
క్రికెట్ ఆడుతూ పిచ్‌పై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన క్రికెటర్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు నలవాడేకు ఘనంగా నివాళులర్పించారు.