టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫేస్‌బుక్‌ ఐడీ హ్యాక్‌

169
TRS MLA Facebook Hacked

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫేస్‌బుక్‌ ఐడీ హ్యాక్‌ అయింది. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌ పేరిట ఉన్న ప్రకాష్‌గౌడ్‌ యువసేన ఐడీని సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు.

దీని ద్వారా డబ్బులు అడుగుతున్నట్లుగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు సమాచారం అందడంతో మంగళవారం ఆయన సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఐడీతో ఎలాంటి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు స్వీకరించకూడదని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు ఆయన సోషల్ మీడియాలో తెలిపారు.

హ్యాకింగ్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి వాటి పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.