బ‌ద్రీనాథ్ ఆల‌యం పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు!

195
Badrinath temple reopened Muhurham

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన బ‌ద్రీనాథ్ ఆల‌యం పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.

మే నెల 18న ఆల‌య ద్వారాలు తెరచుకోనున్నాయి. వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం టెహ్రీ రాజ వంశ‌స్థులు బ‌ద్రీనాత్ ఆల‌యం పునఃప్రారంభానికి ముహూర్తం నిర్ణ‌యించారు.

మే 18న‌ ఉద‌యం 4.15 గంట‌లకు ఆల‌య ద్వారాలను తెరుస్తామ‌ని చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు అధికారులు వెల్ల‌డించారు.

బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని ప్ర‌తికూల‌ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌తి ఏడాది శీతాకాలంలో మూసివేస్తారు. అనంత‌రం వేస‌విలో తిరిగి తెరుస్తారు.

ఆల‌య ప్రారంభానికి ముందు ఏప్రిల్ 29న న‌రేంద్ర‌న‌గ‌ర్ ప్యాలెస్ నుంచి అఖండ జ్యోతి బ‌ద్రీనాథ్‌కు బ‌య‌లుదేరుతుంది.

మే 18న జ్యోతి ఆల‌యానికి చేరుకోగానే స్శాత్రోప్తవేతంగా, వేద‌పండితుల మంత్రోచ్ఛార‌ణ‌ల మధ్య మంగళ వాయిద్యాలతో ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.