తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎన్నికయ్యారు.
అధ్యక్షుడిగా బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డిలను కూడా ప్రతినిధులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చర్చల అనంతరం పూర్తిస్థాయి కమిటీని ప్రకటించనున్నట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో టీబీజీకేఎస్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది.
అనంతరం ఎన్నికలు నిర్వహించారు.ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ మాట్లాడుతూ.. తమను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలో లేని హక్కులను సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు పాల్గొనారు.