అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 130 వాహనాలు ఒకదానికొకటి ఢీ!

197
Road accident in America 130 vehicles collide

ఆగ్ర రాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెక్సాస్‌ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

డల్లాస్‌కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్త్‌విత్‌ సమీపంలో ఏకంగా 130 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.

ఈ ప్రమాదంలో ఎనిమిది మృతి చెందారు. మరో 70మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

తీవ్రమైన మంచు తుఫాను కారణంగా రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనతో కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు స్తంభించాయి. రహదారిపై వాహనాలన్నీ చిందరవందరగా పడిపోయాయి.

ఫెడ్‌ఎక్స్‌కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ను ఢీకొని ఆగిపోయింది.

వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

ప్రమాదం కారణంగా చాలా వాహనాలు నుజ్జునుజ్జయాయని తెలిపారు. సమాచారం తెలుసుకున్న సహాయక సిబ్బంది ఘటనస్థలికి చేరుకున్నారు.

వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.